News April 12, 2025
విశాఖ: నేడే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది పరీక్షలు రాశారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్ఫోన్లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 13, 2025
జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2025
కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన హోం మంత్రి

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు కైలాసపట్నం అగ్ని ప్రమాద బాధ్యతల్ని ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడం బాధాకరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ని ఆదేశించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని ఆమె వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.
News April 13, 2025
విశాఖ జూలో 27 జింకల జననం

విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో 27 జింకలు పుట్టినట్లు క్యూరేటర్ మంగమ్మ ఆదివారం తెలిపారు. జూ పార్క్‌లో జంతువుల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో ఒక మౌస్ డీర్, రెండు బార్కింగ్ డీర్, మూడు నీల్ ఘై, ఐదు సాంబార్ డీర్, ఏడు స్పాటెడ్ డీర్, తొమ్మిది బ్లాక్ బక్స్ ఉన్నాయన్నారు. జూ సందర్శకులు ఈ అందమైన జింకలను చూసేందుకు మరికొద్ది రోజుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.