News June 10, 2024

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లి పండగ

image

ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం గంగమ్మతల్లి పండగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి.. తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News January 16, 2025

నక్కపల్లి: బాలుడిని కాపాడబోయి మృత్యువాత పడిన యువకుడు

image

ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో <<15167020>>బాలుడిని<<>> కాపాడబోయిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈనెల 15వ తేదీన సముద్రతీరంలో బాలుడు మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లిన మణికంఠ అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన యువకుడు గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల సముద్రతీరానికి కొట్టుకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 16, 2025

విశాఖ: స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరిన ప్రజలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. దీంతో జిల్లాలోని రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. మరికొందరు సొంత వాహనాలతో తిరుగుపయనం అవుతున్నారు.

News January 16, 2025

విశాఖలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!

image

విశాఖ జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ విశాఖలో 1500 ఎకరాల పరిధిలో సోలార్ ప్లేట్స్ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే అనీల్ అంబానీ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించిన సంగతి తెలిసిందే.