News November 24, 2024
విశాఖ బీచ్‌లలో సందడి
రుషికొండ బీచ్‌కు పర్యాటకులు పోటెత్తారు. కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున బీచ్‌కు చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రుషికొండతో పాటు, ఆర్కే, యారాడ, భీమిలి, సాగర్ నగర్ బీచ్‌లలో పర్యాటకుల సందడి కనిపించింది. విశాఖలో మీకు ఇష్టమైన బీచ్ ఏదో కామెంట్ చెయ్యండి.
Similar News
News November 24, 2024
విశాఖ జూలో సండే సందడి
ఇందిరా గాంధీ జూపార్క్‌ను ఆదివారం 13,650 మంది సందర్శకులు వచ్చినట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున వనయాత్రలకు వచ్చారన్నారు. రూ.9,61,724 ఆదాయం వచ్చిందని జూ క్యూరేటర్ తెలిపారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున్న సందర్శకులు ఇందిరా గాంధీ జూపార్క్‌కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
News November 24, 2024
ఏపీకి పెట్టుబడుల వరద మొదలైంది: హోం మంత్రి అనిత
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పెట్టుబడుల వరద మొదలైందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తను ప్రాతినిత్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో రాజయ్య పేటలో ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్స్ ముందుకు రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపన్నారు. రూ.1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
News November 24, 2024
విశాఖలో ప్రధాని పర్యటనపై కలెక్టర్ సమీక్ష
ఈనెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఐఎన్ఎస్ డేగాలో బస చేస్తారని వెల్లడించారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.