News March 19, 2024
విశాఖ: మనస్తాపంతో విద్యార్థి సూసైడ్

విశాఖ నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి భాను చైతన్య(20) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భాను చైతన్య బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 21, 2025
V.M.R.D.Aకు ఇన్‌ఛార్జ్ కమిషనర్

V.M.R.D.A. మెట్రోపాలిటన్ కమిషనర్ K.S. విశ్వనాథన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (M.M.R.D.A.) కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సోమవారం ముంబై వెళ్లారు. 22వ తేదీన కూడా ఆయన అధ్యయనం ముంబైలో ఉంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ని ఇన్ ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 21, 2025
ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. జనవరిలో నిర్వహించిన రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.