News January 30, 2025
విశాఖ: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

విశాఖలో మార్చి 8న జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. విశాఖలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ పాల్గొన్నారు.
Similar News
News February 21, 2025
విశాఖ: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. మాతృ, శిశు మరణాలు నమోదు కాకుండా చర్యలు చేప్పట్టాలన్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటివి రాకుంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష జరిపి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. DMHO జగదీశ్వర రావు ఉన్నారు.
News February 20, 2025
విశాఖ టుడే టాఫ్ న్యూస్

☞ విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ☞గంజాయి తాగినా రౌడీషీట్: విశాఖ DIG ☞కనకమహాలక్ష్మి సేవలో విదేశీ యువతులు ☞విశాఖ: VRS చేస్తే రూ.50 లక్షలు..! ☞ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా ☞విశాఖలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు ☞విశాఖ: జనారణ్యంలోకి వచ్చిన దుప్పి ☞హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి ☞ఆనందపురం: ఆవు పొట్టలో 50 కేజీల ప్లాస్టిక్ ☞విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
News February 20, 2025
విశాఖ: తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇతర సంఘటనలు జరిగాయని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు వార్తలను, సమాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుందన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.