News January 21, 2025
విశాఖ మీదుగా వెళ్లే 8 రైళ్లకు అదనపు బోగీలు
విశాఖ మీదుగా వెళ్లే 8 రైళ్ళకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. జనవరి 22 నుంచి 12375/76 నకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, మార్చ్ 25నుంచి 12835/36నకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు శాశ్వతంగా పెంచనున్నారు. జనవరి 21నుంచి ఫిబ్రవరి 18వరకు 22603/04 నకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను, జనవరి 22 నుంచి ఫిబ్రవరి 19 వరకు 22605/06 నకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచనున్నారు.
Similar News
News January 22, 2025
విశాఖలో కంపెనీలు పెట్టండి: మంత్రి లోకేశ్
పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. విశాఖలో ఆటో మొబైల్ ఉత్పత్తి, సప్లయ్ చైన్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ZF ఫాక్స్‌కాన్ CEO దృష్టికి తీసుకెళ్లారు. సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్సోడస్‌ను కోరారు. గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, బ్యాక్ ఎండ్ ఐటీ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలని రాజీవ్ మోమానీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
News January 22, 2025
ఉమ్మడి విశాఖలో 29 మద్యం షాపులు కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.
News January 22, 2025
భీమిలిలో దివ్యాంగ బాలికపై అత్యాచారం
భీమిలి పట్టణంలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసికస్థితి సరిగా లేకపోవడంతో పాటు పోలియోతో బాలిక మంచం పైనే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక నానమ్మ బయటికి వెళ్లి వచ్చి చూసేసరికి నిందితుడు లోపల ఉండటంతో కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.