News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News March 22, 2025
సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.
News March 22, 2025
NGKL: ఆ పథకం దరఖాస్తుకు ఈనెల 31 లాస్ట్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 31 చివరి తేదీ జిల్లా అధికారి షాబుద్దీన్ తెలిపారు. 21-24 వయసు, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉన్న వారు అర్హులు. నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థుల ఖాతాలో నేరుగా జమ చేస్తారని తెలిపారు.
News March 22, 2025
చందుర్తి : అకాలవర్షంతో పంట నష్టం

అకాల వర్షం మండలవ్యాప్తంగా అపార నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టింది. శుక్రవారం సాయంత్రం కురిసిన బలమైన ఈదురుగాలులతో కూడిన వానకు పంటలు దెబ్బతిన్నాయి. చందుర్తి పాటు, మల్యాల, తిమ్మాపూర్, రామన్నపేట, నర్సింగాపూర్ గ్రామాల్లో సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పలువురు రైతులకు చెందిన వరి పంట నేల రాలిపోయింది. పంట చేతికందే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలకు నష్టపోవడంతో రైతులు కంటతడి పెట్టారు.