News July 19, 2024

విశాఖ మెడ్ టెక్ జోన్‌ను సందర్శించిన రాష్ట్ర మంత్రి

image

విశాఖ ఉక్కు నగరం పరిధిలో ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్‌ను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ వివిధ కంపెనీల ఆపరేషన్స్ ప్రక్రియలను పరిశీలించారు. వైద్య పరికరాల తయారీకి సంబంధించిన వివిధ కంపెనీలను సందర్శించి కంపెనీల సీఈవోలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అక్కడున్న వసతులు, కంపెనీలు, ఉద్యోగులు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 1, 2024

స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన సక్సేనా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏ.కే.సక్సేనా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా పనిచేస్తున్న సక్సేనా స్టీల్ ప్లాంట్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్లాంట్ డైరెక్టర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత కర్మాగారాన్ని సందర్శించారు.

News September 30, 2024

విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్

image

ఎండాడ మహిళా పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.

News September 30, 2024

విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it