News March 21, 2025

విశాఖ మేయర్ పీఠం కదలనుందా? 

image

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్‌ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.

Similar News

News March 22, 2025

జీవీఎంసీలో 101 అంశాలకు ఆమోదం 

image

జివిఎంసి స్థాయి సంఘం సమావేశం శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశంలో 104 అంశాలు పొందుపరిచారు. వాటిలో ఒక అంశాన్ని వాయిదా వేశారు. 2 అంశాలను సభ్యులు తిరష్కరించారు. మిగిలిన 101 అంశాలు ఆమోదం పొందాయి. సమావేశంలో కార్యదర్శి బి.వి.రమణ, జోనల్ కమిషనర్లు ప్రేమ ప్రసన్నవాణి ,శివప్రసాద్, మల్లయ్య నాయుడు, బి.రాము ఉన్నారు.

News March 22, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.6లక్షల పరిహారం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.

News March 21, 2025

విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.

error: Content is protected !!