News April 6, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మల్కాపురానికి చెందిన సత్యనారాయణ స్కూటీపై కుమార్తె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్‌యార్డ్ నుంచి మారుతీ సర్కిల్ మీదుగా వెళుతుండగా కొత్త పెట్రోల్ బంక్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 7, 2025

విశాఖలో ఏసీబీ దాడులు

image

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్‌సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యడెండ్‌గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 7, 2025

విశాఖ: ‘జేఈఈ పరీక్షకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి’

image

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.

News April 7, 2025

విశాఖలో కేజీ అల్లం ధర ఎంతంటే?

image

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ. కిలో) టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60, గ్రీన్ పీస్ రూ.60గా ధరల నిర్ణయించారు.

error: Content is protected !!