News April 18, 2025
విశాఖ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్

విశాఖ విమానాశ్రయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఇద్దరు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు, నిషేధిత ఈ- సిగరెట్లను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66,90,609 ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఫోన్లు, ఈ- సిగరెట్లను నగరానికి అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి వారిని పట్టుకున్నారు.
Similar News
News April 19, 2025
ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ

జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్‌ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.
News April 19, 2025
విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.
News April 19, 2025
వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.