News June 22, 2024
విశాఖ: వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
విశాఖ నగరం ఎండాడ వద్ద గల వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్థల సేకరణ చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా భవన నిర్మాణం చేశారని అధికారులు తెలిపారు. వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News January 3, 2025
ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 8న అచ్చుతాపురం, నక్కపల్లిలో పలు పరిశ్రమలను విశాఖ నుంచి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాప చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 3, 2025
కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌కు 228 మంది హాజరు
పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ కైలాసగిరి వద్ద పోలీస్ మైదానంలో గురువారం ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని పర్యవేక్షించారు. 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు, ఛాతీ పరీక్షలు నిర్వహించారు. 600 మంది అభ్యర్థులకు గాను 228 మంది హజరయ్యారని ఎస్పీ తెలిపారు.
News January 2, 2025
డిప్యూటీ సీఎంకు చటకంభ గ్రామస్థుల విన్నపం
అల్లూరి జిల్లా పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో చటకంభ ఉంది. గ్రామంలో 240 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఆ గ్రామం మీదుగా 30 గ్రామాలున్నాయి. 15 సంవత్సరాలు క్రితం వేసిన మట్టిరోడ్డు ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో తారురోడ్డు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అల్లూరి జిల్లా కలెక్టర్‌ను ఆ గ్రామస్థులు విన్నవించుకున్నారు.