News April 14, 2025
విశాఖ: వైసీపీకి బెహరా రాజీనామా

విశాఖలో YCPకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడైన బెహరా భాస్కర్ రావు రాజీనామా చేశారు. ఆయన వైసీపీ హయాంలో GVMC కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. విశాఖ సౌత్ MLAవంశీకృష్ణ యాదవ్‌తో సోమవారం భేటీ అయిన నేపథ్యంలో జనసేనలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. YCPకార్పొరేటర్లుగా ఆయన భార్యతో పాటు కోడలు వరుసయ్యే ఆమె ఉన్నారు. మేయర్‌పై అవిశ్వాసం ముందు వారు నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.
Similar News
News April 16, 2025
కాళ్ల: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో టీచర్

కాళ్ల మండలం సీసలి హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న చెల్లుబోయిన పద్మ సంగీత వాయిద్య ప్రదర్శనల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబర్చిన పద్మకు హైదరాబాద్ హలెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందించారు.
News April 16, 2025
కృష్ణా: అంతరించిపోతున్న ఈత బుట్టలు.!

ఓ కాలంలో ప్రతిష్ఠగా నిలిచిన ఈత బుట్టలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, సుంకొల్లు, పామర్రు, గన్నవరం, బాపులపాడు తదితర ప్రాంతాల్లో తయారయ్యేవి. ఈత చెట్ల చువ్వలు కోసి, వాటిని చేతితో నేసి అందంగా తయారు చేసేవారు. పట్టణాల్లోకి వెళ్లి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక ఈ కళ జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది.
News April 16, 2025
KMM: కోచ్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లా లోని మధిర, వైరా, కల్లూరు మినీ స్టేడియాల్లో క్రీడా కారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి సునిల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎన్ఐఎస్ శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 22 కల్లా తమ దరఖాస్తులను సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలని కోరారు.