News February 22, 2025

విశాఖ: షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య

image

అనకాపల్లి గవరపాలెం సాగిదుర్గరాజు వీధిలో ఈనెల 19న ఆత్మహత్యకు ప్రయత్నించిన మంగారపు జ్యోతి(29) చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త షేక్ అబ్దుల్ ఘనితో కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 19న తనను బయటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. ఇప్పుడు బయటకు ఎందుకని ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురై మేడపైకి వెళ్లి ఉరేసుకుంది. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.

Similar News

News February 23, 2025

మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

image

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

News February 23, 2025

దువ్వాడ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

image

దువ్వాడ మీదుగా సంబల్ పూర్ – ఈరోడ్ (08311/12), భువనేశ్వర్ – యస్వంత్ పూర్ (02811/12)రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణీకుల రద్దీని నియంత్రించేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ – ఈరోడ్, మార్చ్ 1నుంచి ఏప్రిల్ 26వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ – యస్వంత్ పూర్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.. ప్రయాణికులు గమనించాలన్నారు.

News February 22, 2025

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలనీ, ఉమెన్ సేఫ్టీ‌కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

error: Content is protected !!