News March 19, 2024
విశాఖ సాగర జలాల్లో నేవీ విన్యాసాలు
విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో సాగర జలాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య హెచ్ఎడిఆర్-హ్యుమానిటీరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ పేరుతో నేవీ విన్యాసాలు ప్రారంభమైనట్లు నేవీ అధికారులు తెలిపారు. 18న ప్రారంభమైన విన్యాసాలు సీఫేజ్, హార్బర్ ఫేజ్‌ల్లో కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల అధికారులు భారత్ నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అమెరికాకు చెందిన యుద్ధనౌక టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయన్నారు.
Similar News
News November 23, 2024
పచ్చ మంద దుష్ప్రచారం: గుడివాడ అమర్నాథ్
చంద్రబాబు ఏం చేసినా ఒప్పు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99 లకు కొంటే తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ.2.49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
News November 23, 2024
నాపై కేసు కొట్టేయండి: హోం మంత్రి అనిత
హోం మంత్రి అనిత చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నానని తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70 లక్షలు అప్పుతీసుకున్నారు. 2018లో అప్పుకు అతనికి చెక్కును ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఇటీవల ఆమె హోం మంత్రి అయ్యాక రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.
News November 23, 2024
విశాఖ: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం
విశాఖలోని కొబ్బరి తోట వద్ద ఓ బాలిక మిస్సింగ్ కేసులో రౌడీ షీటర్‌ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14వ తేదీన తన కుమార్తె కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయగా చివరకు ప్రేమ పేరుతో రౌడీ షీటర్ దేశరాజ్ కుమార్ మాయ మాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును మార్పు చేసి పోక్సో చట్టం కింద రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.