News June 7, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై దృష్టి: పల్లా
విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రతినిధులు గురువారం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సత్కరించి అభినందించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెడతానన్నారు. ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.
Similar News
News January 28, 2025
విశాఖలో నారా లోకేశ్‌కు అర్జీలు
విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కసింకోట నుంచి తన మూడేళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆర్థికసాయం అందించాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్ ను తొలగించారని విశాఖ సీతంపేటకు చెందిన అవ్వ కాంతం విజ్ఞప్తి చేశారు. తన తండ్రి సంపాదించిన భూమి ఆక్రమించారని విజయనగరం జిల్లా అంగటి లక్ష్మి ఫిర్యాదు చేసారు. అర్జీల పట్ల చర్యలు తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
News January 28, 2025
విశాఖ: ‘అందుబాటు ధరల్లో స్థలాలు’
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్”లో స్థలాలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని వి.ఎం.ఆర్.డి.ఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖ జిల్లా రామవరం, పాలవలస, గంగసాని అగ్రహారం, అనకాపల్లి జిల్లా అడ్డూరు, విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతాలలో అన్ని మౌలిక వసతులతో లభ్యమవుతున్నాయన్నారు. అనాధికారిక లేఔట్లలో స్థలాలు కొని మోసపోవద్దని సూచించారు.
News January 28, 2025
విశాఖ: 8 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు
విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.