News September 24, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎంఎస్-1లో ప్రమాదం జరగడంతో షిఫ్ట్ ఇన్ ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్‌పి బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు. గాయపడిన మల్లేశ్వరరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 30, 2024
హుకుంపేట: దూలానికి బోర్డు.. రెండు రేకులే పాఠశాల పైకప్పు
అల్లూరి జిల్లా హుకుంపేట(M) ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిధులు మంజూరయినప్పటికీ పాఠశాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో బోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఎండ, చలి, విష సర్పాల నుంచి రక్షణ లేకుండా పోయిందని, పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 30, 2024
కంచరపాలెం: ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా
కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ అధికారి చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో పలు కన్స్ట్రక్షన్, హెచ్డీబీ ఫైనాన్స్, మెడిప్లస్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. SSC, ఇంటర్, ఐటిఐ ఎలక్ట్రిషన్, డిగ్రీ డిప్లమో ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
News December 30, 2024
సబ్బవరం: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
సబ్బవరం PS పరిధిలోని అమ్ములపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. బలిజపాలెంకు చెందిన సూర్యారావు(48), భార్య మంగమ్మ ఆదివారం సబ్బవరం వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు బైక్‌పై స్వగ్రామం బయలుదేరారు. అమ్ములపాలెం వద్ద వెనుక వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యారావు చనిపోయారు. గాయపడ్డ మంగమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.