News April 13, 2025
విశాఖ: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ 2025-26 ఆర్ధిక సంవత్సరంకు ఎస్.సి.నిరుద్యోగ యువతకు 16.88 కోట్ల రూపాయలతో వివిధ స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడానికి ఆమోదం తెలిపిందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. https://apobmms.apcfss.in లో ఏప్రిల్ 14నుంచి మే 10లోపు బిపిఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు వెబ్సైట్‌లో చూడాలని అన్నారు.
Similar News
News April 15, 2025
సింహాచలం చందనోత్సంపై సమీక్షించనున్న మంత్రి

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఓ హోటల్‌లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.
News April 15, 2025
దువ్వాడ: రైలులో ప్రసవించిన మహిళ

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్‌కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్‌కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
News April 14, 2025
ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని: హీరో నాని

పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని’ అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్- 3’ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం థియేటర్లో సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని మరిన్ని విషయాలు పంచుకున్నారు.