News October 16, 2024

విశాఖకు తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్: MP

image

విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.

Similar News

News January 2, 2025

రామతీర్థం హుండీల ఆదాయం ఎంతంటే..!

image

పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.18.32 లక్షల ఆదాయం లభించినట్లు దేవాలయ కార్యనిర్వహణధికారి వై.శ్రీనువాసరావు వెల్లడించారు. దేవస్థానంలో విజయనగరం ఏసీ కార్యాలయం నుంచి వచ్చిన జి.శ్రామ్ ప్రసాద్, కె.పద్మావతి పర్యవేక్షణలో గురువారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో పైడిమాంబ సేవా సంఘం, రామతీర్థం ఏపీజీవీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

News January 2, 2025

‘తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి పేరు పున‌రుద్ద‌ర‌ణ‌’

image

తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజ‌ర్వాయ‌ర్‌గా పేరును పున‌రుద్ద‌రిస్తూ ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి పేరును పున‌రుద్ద‌రించాల‌ని ఎస్‌.కోట ఎంఎల్ఏ కోళ్ల ల‌లిత‌కుమారి కూడా మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ఈ అంశాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని చేసిన కృషి ఫ‌లితంగా పేరు పున‌రుద్ద‌ర‌ణ జ‌రిగిందని అధికారులు ప్రకటించారు.

News January 2, 2025

VZM: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. 20 విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టెన్త్ నుంచి PG వరకు విద్యార్హతలు ఉన్నవారికి అవకాశం ఉంది. 1/7/2024 నాటికీ 18-42 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8 చివరి తేది. మరిన్ని వివరాలకు www.vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. >Share it