News April 25, 2025

విశాఖలో 97 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 97 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.

Similar News

News April 25, 2025

విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

image

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.

News April 25, 2025

వందేళ్ల పండగకు రెఢీ అవుతున్న ఏయూ 

image

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రో.రాజశేఖర్ తెలిపారు. తొలిరోజు ఉదయం 6గంటలకు ఆర్కే బీచ్‌లో శతాబ్ది వాక్ థాన్ ప్రారంభంకానుందని అన్నారు. ఉ.9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మ.3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ హాజరవుతారన్నారు.

News April 25, 2025

విశాఖ రేంజ్‌లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.

error: Content is protected !!