News March 21, 2025
విశాఖలో అడ్మిషన్స్‌కు ఆహ్వానం

భీమిలి, ఆనందపురం, పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి బాలికలకు అడ్మిషన్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు పథక సమన్వయకర్త చంద్ర శేఖర్ గురువారం తెలిపారు. 6వ తరగతిలో 120 సీట్లు,11వ తరగతిలో 120 సీట్లు, 7వ తరగతిలో 2 సీట్లు,12వ తరగతిలో 23 సీట్లకు ఆన్ లైన్‌లో మార్చ్ 22నుంచి ఏప్రిల్ 11లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు ఉన్న బాలికలు మాత్రమే అర్హులు.
Similar News
News March 31, 2025
విశాఖ సీపీ ఆఫీసులో పీ.జీ.ఆర్.ఎస్ రద్దు

రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News March 30, 2025
విశాఖలో మ్యాచ్ చూసిన అనాథ చిన్నారులు

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు 65 మంది అనాథ చిన్నారులకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ అవకాశం కల్పించారు. వీరిలో భీమిలి ఎస్.ఓ.ఎస్ ఆర్గనైజేషన్ నుంచి 45 మంది, గాజువాకకు చెందిన డిజైర్ ఆర్గనైజేషన్ నుంచి 20 మందికి అవకాశం కల్పించారు. క్రికెట్ నేరుగా చూడడం తమకు చాలా సంతోషంగా ఉందని పిల్లలు హర్షం వ్యక్తం చేశారు. సీపీతో కలిసి వారు ఫొటోలు దిగారు.
News March 30, 2025
విశాఖలో క్రికెట్ మ్యాచ్ చూసిన ప్రముఖులు

విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ఢిల్లీ- సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌ను దేశ, రాష్ట్ర ప్రముఖులు వీక్షించారు. వీక్షించిన వారిలో ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే.