News March 17, 2025

విశాఖలో చిన్నారి మృతి.. ట్విస్ట్ ఏంటంటే?

image

విశాఖలో కన్న <<15787560>>బిడ్డను<<>> చంపిన దారుణం తెలిసిందే. ఈ ఘటనలో ఆసక్తికర విషయాలను సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. హనుమంతువాక పెద్దగదిలికి చెందిన భార్యాభర్తలకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య శిరీష తన 5 నెలల చిన్నారిని ఇంట్లోనే దిండుతో అదిమి చంపేసింది. ఆ తర్వాత తెన్నేటి పార్క్ వద్ద ఉన్న బీచ్‌కు వెళ్లి.. పాప నీటిలో మునిగి చనిపోయినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఫిర్యాదుతో అసలు నిజం తెలిసింది. 

Similar News

News March 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

News March 18, 2025

తిరుపతిలో ధర్నా.. బీసీవై పార్టీ చీఫ్‌పై కేసు

image

AP: తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా <<15787478>>సాధువులతో కలిసి ధర్నా<<>> చేసిన బీసీవై(భారత చైతన్య యువజన) పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్‌పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై FIR నమోదైంది.

News March 18, 2025

NZSR: హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపికైన వెన్నెల

image

టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికయ్యింది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180/300 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు.

error: Content is protected !!