News March 19, 2024
విశాఖలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సబ్బవరం సీఐ
విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 23, 2024
విశాఖ: 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు
ఈనెల 25న విజయవాడ-విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ-కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి పాసింజర్ రైలు రద్దు చేశామన్నారు. 26న విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
News November 23, 2024
పచ్చ మంద దుష్ప్రచారం: గుడివాడ అమర్నాథ్
చంద్రబాబు ఏం చేసినా ఒప్పు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99 లకు కొంటే తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ.2.49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
News November 23, 2024
నాపై కేసు కొట్టేయండి: హోం మంత్రి అనిత
హోం మంత్రి అనిత చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నానని తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70 లక్షలు అప్పుతీసుకున్నారు. 2018లో అప్పుకు అతనికి చెక్కును ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఇటీవల ఆమె హోం మంత్రి అయ్యాక రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.