News March 26, 2025
విశాఖలో టమోటా రేటు ఎంతంటే?

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు బుధవారం కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/కేజీలలో) వాటి వివరాలు టమోటా రూ.16, ఉల్లి రూ. 23, బంగాళాదుంపలు రూ.16, తెల్ల వంకాయలు రూ.28, బెండ రూ.28, కాకర రూ.32, బీర రూ.38, క్యారెట్ రూ. 28/32, బీట్రూట్ రూ.24, బరబాటి రూ.25, గ్రీన్ పీస్ రూ.52, క్యాప్సికం రూ.38, పొటాల్స్ రూ. 48, బీన్స్ రూ.48, క్యాబేజీ రూ.10, కాలీఫ్లవర్ రూ.20, నిర్ణయించారు.
Similar News
News April 1, 2025
విశాఖ మేయర్ పీఠంపై వీడనున్న ఉత్కంఠ..!

విశాఖ మేయర్ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్ ఎం.హరేంద్ర ప్రసాద్‌కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్‌కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
News March 31, 2025
జీవీఎంసీలో రూ.510 కోట్ల ఆస్తిపన్ను వసూలు

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇంచార్జి కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.
News March 31, 2025
విశాఖలో బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు అరెస్ట్: సీపీ

క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడితో పాటు ప్రమోట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ విశాఖలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రవీణ్ కుమార్, మదీనావలి, రజియాబేగం, ధరణి అనే వారిని అరెస్టు చేశామని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లపై సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.