News January 26, 2025

విశాఖలో నకిలీ IAS జంటకు రిమాండ్

image

విశాఖలో IASగా చలామణి అవుతున్న వంగవేటి భాగ్యరేఖ@అమృత, మన్నెందొర చంద్రశేఖర్ జంటపై MVP పోలీసులు కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసారు. న్యాయ స్థానంలో వారిని హాజరుపరచగా ఇద్దరికీ 15రోజులు రిమాండ్ విధించారు. అనేక మంది అమాయకులకు ఉద్యోగాలు కల్పిస్తామని, TIDCO ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు అడుగుతుంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపారు.

Similar News

News January 27, 2025

పద్మనాభం: ఉరి వేసుకుని మహిళ, యువకుడు మృతి

image

పద్మనాభ (మం) కృష్ణాపురంలో ఓ మహిళ, యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివాహిత మహిళ లక్ష్మి(31), మోకర ఆదిత్య(21) గ్రామంలో వేర్వేరు చోట్ల ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News January 27, 2025

విశాఖ: 8 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు

image

విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖలో ఓ హోటల్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 150కి పైగా పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 825 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు.

News January 27, 2025

వారిని విడిచి పెట్టేది లేదు: మంత్రి లోకేశ్

image

చట్టాలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం ఓ కోర్టు కేసుకు సంబంధించి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెడ్ బుక్కును చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు చట్టాలను ఉల్లంఘించే ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.