News July 19, 2024

విశాఖలో నేడు పాఠశాలలకు సెలవు

image

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈఓ చంద్రకళ ఉదయం ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు దీనిని పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 18, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లాప్‌టాప్, రెండు మొబైల్స్, 80 బ్యాంకు అకౌంటులను స్వాధీనం చేసుకొని వాటిలో రూ.140కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లావాదేవీలకు సహకరించిన నలుగురుని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.

News January 18, 2025

విశాఖ: నేడు స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్.. కలెక్టర్ సూచనలు

image

స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్య‌క్ర‌మంలో జిల్లా యంత్రాంగం భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, గార్బేజ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సూచించారు.

News January 17, 2025

భీమిలి: కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగుమందు తాగి మృతి

image

భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న <<15172608>>ముస్తఫా<<>> ఈనెల15న ఉదయం కాకరకాయ జ్యూస్ అని భావించి పురుగుమందు తాగడంతో మృతి చెందాడు. తనకు షుగర్ వ్యాధి ఉండడంతో రోజు కాకరకాయ జ్యూస్ తాగుతాడు.14న మొక్కలకి పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్‌లో ఉంచాడు. ఆ విషయం మర్చిపోయి పురుగుల మందు తాగాడు. భార్య ఫాతిమా పురుగుల మందు ఏదని ప్రశ్నించడంతో తాగింది పురుగుమందు అని తెలిసింది.