News March 3, 2025
విశాఖలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొని, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. రౌడీ షీటర్ల మీద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
Similar News
News March 3, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు నాయుడు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసుల నాయుడు 710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి రోజు నుంచి ముగ్గురు మధ్య పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రతి రౌండ్లో శ్రీనివాసులు నాయుడు కొంతమేరకు ఆదిక్యం కనపరుస్తూనే వచ్చారు. చివరకు ఎలిమినేషన్ రౌండ్-2 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శ్రీనివాసులు నాయుడు గెలుపొందినట్టు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.
News March 3, 2025
విశాఖ: ఒకే వేధికపై చంద్రబాబు, దగ్గుపాటి

సీఎం చంద్రబాబు ఈనెల 6న విశాఖ రానున్నారు. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొంటారు. సుదీర్ఘకాలం తర్వాత తోడల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించనున్నారు.
News March 3, 2025
వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు: విశాఖ డీఈవో

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం విడుదల చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్‌లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. 9552300009 నంబర్‌కు హాయ్ అని పంపిస్తే దాని ద్వారా వాట్సాప్ సేవలు > విద్యా సేవలు > SSC హాల్ టికెట్ > అప్లికేషన్ నంబర్ > చైల్డ్ ఐడీ, పుట్టిన తేదీ > స్ట్రీమ్ > కన్ఫర్మ్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.