News March 23, 2025
విశాఖలో హత్య కేసు రీ ఓపెన్.. అనకాపల్లి వ్యక్తి అరెస్ట్

విశాఖలో 2021లో జి.శ్రీను అనే వ్యక్తి మర్మాంగం కోసి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యపై ఎలాంటి ఆధారాలు లేక అప్పుడు క్లోజ్ చేశారు. ప్రస్తుతం విశాఖ పోలీసులు ఈ కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను అనకాపల్లి జిల్లా రాంబిల్లి మం. జంగవాని పాలేనికి చెందిన లాలం గణేష్, పెద్ద గంట్యాడకు చెందిన తారకేశ్వరరావు చేసినట్లు గుర్తించారు. దీంతో శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
Similar News
News March 26, 2025
వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్‌సైజ్‌లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.
News March 26, 2025
చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7- 2025 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయడానికి అర్హతలతో దరఖాస్తులు కోరుతోందిని వివరించారు. ఏప్రిల్ 15లోపు చేనేత నుంచి HYDలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
News March 26, 2025
వనపర్తి: కూరగాయలు, పండ్లు పాడవుతున్నాయా? ఇలా చేయండి..

✓ కూరగాయలను నేరుగా వేడి తాకే ప్రదేశంలో పెట్టవద్దు. ✓ ఫ్రిజ్ టెంపరేచర్ 4°C లేదా అంతకంటే తక్కువే ఉంచాలి. ✓ ఫ్రిజ్ అంతా సరుకులతో నింపకుండా గాలి తాకేలా స్పేస్ ఉంచాలి. ✓ అరటి, ఆపిల్, టమాటా, అవకాడో లాంటి పండ్లు, కూరగాయలు ఇథలిన్‌ను విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినవీ త్వరగా పండుతాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని వేరువేరుగా ఉంచాలి. ✓ త్వరగా పాడయ్యే వాటిని ముందు వాడుకోవడం ఉత్తమం.