News November 26, 2024
విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటుపై సంతకాల సేకరణ
విశాఖ హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు బెంచి సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వీనర్, న్యాయవాది ఐఎం.అహమ్మద్, కోకన్వీనర్ గుడిపల్లి సుబ్బారావు ఆద్వర్యంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటు అవశ్యకతపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మోహన్, ఐఎఎల్ రాష్ట్ర అద్యక్షులు సురేశ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News November 27, 2024
విశాఖ: చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్..
చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్‌కు పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆనందపురం మం. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న సుందరరావు, వెంకటేశ్వరరావు 2019 ఆగస్టులో విద్యార్థినులతో వీడియోలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై తోటి టీచర్‌లు MEOకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా నేరం రుజువైంది. దీంతో జడ్జి ఆనందిని వీరికి ఏడాది జైలు శిక్ష విధించారు.
News November 27, 2024
IPLకు అనకాపల్లి జిల్లా యువకుడు.. నేపథ్యం ఇదే
అనకాపల్లి జిల్లా కుర్రాడు పైలా అవినాశ్‌ని IPL వేలంలో పంజాబ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అచ్యుతాపురం మండలానికి చెందిన అవినాశ్ సత్యారావు, నాగమణిల చిన్న కొడుకు. వీరది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాగా అవినాశ్‌కు క్రికెట్ మీద ఉన్న మక్కువ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసిన అవినాశ్ రంజీల్లో సత్తా చాటాడు. దీంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తీసుకుంది.
News November 27, 2024
విశాఖలో మొదలైన రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి
రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్‌ను గెలిపించాలని ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ విశాఖ రైల్వే ఉద్యోగులను కోరారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల బోనస్ కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ చేసిన పోరాట విజయాలను వివరించారు.