News April 16, 2024

వీరఘట్టం: దరఖాస్తులకు గడువు ముగింపు

image

మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్ కే. జయప్రకాశ్ తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు స్వీకరణకు సోమవారంతో గడువు ముగిసిందని అన్నారు. మొత్తం 220 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 7, 2024

పలాస: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

image

వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన రామకృష్ణాపురంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని అన్నారు. క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు

image

శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 7, 2024

జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO

image

శ్రీకాకుళం జిల్లాలో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు