News December 28, 2024

వీరఘట్టం: బాలికలపై లైంగిక దాడులకు పాల్పడింది ఇతనే

image

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే ఆ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వీరఘట్టం మండలంలో సంచలనంగా మారింది. తమ పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడిన ఆ గురువు తెర్లి సింహాచలంకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ చిత్రంలో ఉన్న ఆ కామాంధుడు ఇతనే.. ఈ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News December 29, 2024

ఆడంబరాలు వద్దు.. సేవా కార్యక్రమాలు చేద్దాం: ఎమ్మెల్యే శిరీష

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సేవా కార్యక్రమాలకే తాను ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పూలబొకేలు, మిఠాయిలు, శాలువలతో సత్కారాలు చేయవద్దని కోరారు. ఆ నగదును పేద విద్యార్థులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని ఆమె పేర్కొన్నారు.

News December 29, 2024

SKLM: కోనేరు హంపికి మంత్రి అచ్చెన్న అభినందనలు

image

ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం సాధించిన కోనేరు హంపిని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కోనేరు హంపి గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. రెండోసారి ప్రపంచ టైటిల్‌ను సాధించిన ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు హంపిను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

News December 29, 2024

దక్షిణ భారతదేశంలోనే శ్రీకాకుళం జిల్లా భామిని టాప్

image

భామిని మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని శనివారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతి త్రైమాసికంలో సూచికల సాధనను విశ్లేషిస్తుంది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన బ్లాకులను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే భామిని ఆస్పిరేషనల్ బ్లాక్ అగ్రస్థానంలో నిలవడంతో ప్రోత్సాహకంగా రూ.1.50 కోట్లు పొందిందని కలెక్టర్  తెలిపారు.