News March 1, 2025
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌పై వెళ్తున్న శివ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జి. కళాధర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Similar News
News March 1, 2025
ఇసుక సరఫరాపై సీఎం ఆదేశాలు

TG: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఖనిజాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు TGMDC నుంచే ఇసుక సరఫరా చేయాలన్నారు. పెద్దమొత్తంలో చేపట్టే నిర్మాణ రంగాలకు వీటి నుంచి సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.
News March 1, 2025
వీల్లేంట్రా బాబు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!

హోటల్‌కు వచ్చిన వారిలో కొందరు రూమ్స్‌లోని వస్తువులను దొంగిలిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు సదరు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ముంబైలోని ఓ హోటల్ రూమ్స్‌లో ఉన్న బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఒకే సైజులోని వేర్వేరు చెప్పులను జోడీగా ఉంచారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి Xలో షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 1, 2025
MDCL: వామ్మో..చెమట గక్కిస్తున్న ఎండ..!

MDCL జిల్లాలో మార్చి మొదట్లోనే చెమటలు గక్కెలా ఎండ దంచికొడుతుంది. నేడు బాలానగర్ పరిధి ఓల్డ్ సుల్తాన్ నగర్ ప్రాంతాల్లో 36.2డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మోతీనగర్ ప్రాంతాల్లోనూ ఉక్కపోత వాతావరణం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఎండ దంచికొడుతుందని పేర్కొంది. ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో..! మరీ.