News September 21, 2024
వెంకటగిరి జనసేన ఇన్‌ఛార్జ్‌పై వేటు
వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఆయనపై ఉన్న ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
Similar News
News December 21, 2024
నాయుడుపేట: నదిలో కొట్టుకొచ్చిన అస్థిపంజరం
నాయుడుపేటలో అస్థిపంజరం కలకలం రేపింది. స్వర్ణముఖి నదిలో కొట్టుకొచ్చిన మనిషి అస్తిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 21, 2024
నెల్లూరు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి
బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడింది. బాలాయపల్లిలోని ఓ బాలికను జయంపులో దుకాణం నడుపుతున్న ఓజిలి(M) ఇనుగుంటకు చెందిన సుబ్బారావు ప్రేమ పేరుతో నమ్మించాడు. సుబ్రహ్మణ్యం, వెంటకయ్య, వాణి సహయంతో 2015లో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నలుగురికి పదేళ్ల జైలు, రూ.22వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిన్న తీర్పుచెప్పారు.
News December 21, 2024
నిజాయతీగా పనిచేయండి: అబ్దుల్ అజీజ్
వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్లు నిజాయితీగా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచించారు. 26 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్స్‌తో ఆయన నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు.