News March 22, 2024

వెన్నంపల్లి: గుండెపోటుతో యువకుడి మృతి

image

గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారవ.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మారుపాక మహేష్(30) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. మహేష్‌కు గురువారం రాత్రి గుండెలో నొప్పి రావడంతో హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Similar News

News April 19, 2025

కరీంనగర్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

image

KNR జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.7°C నమోదు కాగా, మానకొండూర్ 42.6, గన్నేరువరం 42.3, గంగాధర 42.1, రామడుగు 41.5, కరీంనగర్ 41.4, చిగురుమామిడి, చొప్పదండి 41.2, తిమ్మాపూర్ 41.1, సైదాపూర్ 40.9, శంకరపట్నం, కరీంనగర్ రూరల్ 40.7, వీణవంక 40.6, హుజూరాబాద్ 40.3, కొత్తపల్లి 39.9, ఇల్లందకుంట 39.9°C గా నమోదైంది.

News April 19, 2025

కరీంనగర్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

image

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.

News April 18, 2025

ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

image

కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 15 మండలాల్లో ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ 100% పూర్తిచేయాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. ఇప్పటీవరకు 2027 మందికి ఇండ్లు మంజూరు కాగా, 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని, 114 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయన్నారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

error: Content is protected !!