News February 25, 2025
వెలుగోడు: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం

వెలుగోడులోని గాంధీ నగర్‌కు చెందిన వజీద్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తొమ్మిది నెలలుగా అతని భార్య పుట్టింట్లో ఉంటోంది. ఈ విషయంపై ఆయన పలుసార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 25, 2025
స్కామ్: లాలూ కొడుకు, కుమార్తెకు షాక్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కాములో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 11న కోర్టుకు రావాలని స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే ఆదేశించారు. ఈ హై ప్రొఫైల్ కేసులో లాలూ సహా 78 మందిపై CBI దాఖలు చేసిన తుది ఛార్జిషీటును కోర్టు పరిశీలించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జోన్లలో భూమికి బదులు ఉద్యోగాలిస్తామని అవినీతికి పాల్పడ్డారని CBI ఆరోపిస్తోంది.
News February 25, 2025
కొడంగల్: సీఎం రేవంత్ సెంటిమెంట్ ఆలయం ఇదే.!

కొడంగల్ పట్టణంలోని శ్రీ గాడిబావి శివాలయం అంటే సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంటుగా భావిస్తారు. 300 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివలింగం అతిపెద్ద పాణివాటం, బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడే నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
News February 25, 2025
ఉద్యోగాల కల్పనపై శాసనమండలిలో గందరగోళం

AP: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని YCP MLC వరుదు కళ్యాణి విమర్శించారు. దీంతో అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. 4లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్పినట్లు ఆమె మాట్లాడగా.. మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. 4లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని చెప్పామని, కల్పించామని చెప్పలేదన్నారు. YCP సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయకుండా కూర్చుంటే చర్చిద్దాం అని తెలిపారు.