News March 4, 2025

వెలుగోడు మండలం నుంచి ఎస్ఐలుగా యువతీ, యువకుడు

image

వెలుగోడు మండలం మాధవరానికి చెందిన మద్దెల సంజీవ కుమార్ కొడుకు సతీశ్, గుంతకందాలకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె నాగ కీర్తన ఎస్ఐలుగా ఎంపికయ్యారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న సతీశ్‌కు శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. నాగ కీర్తనకు కడపలో పోస్టింగ్ ఇచ్చారు. వీరిరువురినీ వారి కుటుంబ సభ్యులు అభినందించారు.

Similar News

News March 4, 2025

రూ.100 కోట్ల ఆస్తి.. తల్లిని చంపేసిన కొడుకు

image

TG: ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ ఘటన సంగారెడ్డి(D) తెల్లాపూర్‌లో జరిగింది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులోని డీఅడిక్షన్‌లో చేర్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్‌ను వేధించేవాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9చోట్ల పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 4, 2025

ఇంటి అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించలేవా?

image

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ సహా చాలా నగరాలు, పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల అద్దెలూ నోరెళ్లబెట్టేలానే ఉన్నాయి. నెలజీతంలో సగం ఇంటి అద్దెకే పోతోందని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోయినా అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా ఓనర్లు ఇష్టారీతిన పెంచే ఈ అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 4, 2025

బ్యూటిఫుల్ ఫొటో: చంద్రుడిపై సూర్యోదయం

image

భూమిపై సూర్యోదయం ఎంత రమణీయంగా ఉంటుందో మనకు తెలుసు. మరి చంద్రుడి పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది? పై ఫొటోలో ఉన్నట్లు ఉంటుంది. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఈ అద్భుతమైన ఫొటోను తీసింది. నాసాకు చెందిన పే లోడ్‌తో ఈ నెల 2న చంద్రుడిపై దిగిన ల్యాండర్ ఆ వెంటనే ఈ ఫొటోను పట్టేసింది.

error: Content is protected !!