News March 19, 2025

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

image

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.

Similar News

News March 20, 2025

23న వేంపల్లెకి రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీన వేంపల్లె పట్టణానికి రానున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి అనంతరం వేంపల్లెలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుకి వెళ్తారని అధికారిక సమాచారం అందింది.

News March 20, 2025

MBNR: బ్యాంకుల్లో ఉద్యోగం.. APPLY చేసుకోండి

image

బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారిని ఇందిర, BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులు ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 12న MBNRలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తామన్నారు.

News March 20, 2025

త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్: పరిగి MLA

image

త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఏర్పాటు కానుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. షాద్‌నగర్ పరిగి మధ్యలోని లక్ష్మీదేవిపల్లి దగ్గర సాగునీటి ప్రాజెక్టు నిర్మించి, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికి కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

error: Content is protected !!