News February 18, 2025
వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 14, 2025
కృష్ణా: పవన్ సభ.. YCP రియాక్షన్.!

జనసేన ఆవిర్భావ సభపై వైసీపీ స్పందించింది. ‘సూపర్ 6 హామీలకు డబ్బులు లేవని బీద ఏడుపు ఏడ్చే పవన్‌కు ప్రజల డబ్బు అంటే లెక్కలేదు. గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షల ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతారు. ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు మాత్రం ఏనాడు ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళతారు.’ అని Xలో శుక్రవారం పోస్ట్ చేసింది. దీనిపై మీ కామెంట్.
News March 14, 2025
NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.
News March 14, 2025
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలి: సీపీఎం

వికారాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా TGSRTC బస్టాండ్‌లల్లో ప్రయాణికులకు బాత్రూంలు, మంచినీళ్లు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని మహిపాల్ కోరారు.