News March 26, 2024

వేసవిలో జాగ్రత్తలు పాటిదాం: కలెక్టర్

image

ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కొరత, వడదెబ్బ వంటి వేసవి సమస్యలను అధిగమించాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత, వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలు” పై తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News April 18, 2025

వైవీయూకు రూ.10 కోట్లు

image

కడప: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకుపోతున్న వైవీయూకు మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ పార్టనర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి రూ.10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థలతో కలసి వైవీయూ రీసెర్చ్ చేస్తుందని వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు.

News April 17, 2025

ప్రొద్దుటూరులో ఒకేరోజు 60 తులాల బంగారం చోరీ.. 18 కేజీల పసిడి పట్టివేత

image

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యెనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపున స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఒక కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.

News April 17, 2025

కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎన్నిక

image

కొండాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న జి.రామకృష్ణారెడ్డి కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కడప పట్టణంలోని STUAP భవనంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొండాపురం కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌లు జయాకర్, రవికుమార్, మహబూబ్ బాషా, వేణుగోపాల్, ప్రిన్సిపల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!