News April 6, 2025

వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన ఖరారు

image

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించనున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.

Similar News

News April 9, 2025

అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. యువకుడికి అధికారుల షాక్

image

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి అధికారులు షాక్ ఇచ్చారు. గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారి పల్లికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు యువతులు మైనర్లు కావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలుపుదల చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్టేషన్‌లో సీఐ శేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

News April 9, 2025

అనంతం: రాష్ట్ర వ్యాప్తంగా AP-ECETకు దరఖాస్తులు

image

అనంతపురం JNTU నిర్వహిస్తున్న APECET-2025 పరీక్షకు అపరాధ రుసుము లేకుండా 33,454 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు APECET ఛైర్మన్ హెచ్.సుదర్శన రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,000 అపరాధ రుసుముతో ఈనెల 12 వరకు.. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 17 వరకు.. రూ.4,000 అపరాధ రుసుముతో ఈనెల 24 వరకు.. రూ.10,000 అపరాధ రుసుముతో ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

News April 9, 2025

అర్జీ సమస్యను స్వయంగా తీర్చిన అనంత కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన (పీజీఆర్ఎస్) అర్జీని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు మండల కేంద్రం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీని జిల్లా కలెక్టర్ పరిశీలించి, అర్జీదారుల పిటిషన్‌పై సమగ్రంగా పరిశీలన చేశారు. ఆత్మకూరు మండల కేంద్రం పరిధిలోని హరిజన లక్ష్మమ్మ అనే అర్జీదారులు ప్రజా సమస్యను పరిశీలించారు.

error: Content is protected !!