News March 30, 2025
వైజాగ్ మ్యాచ్ చూసేందుకు జైషా

విశాఖ వేదికగా జరుగుతున్న SRH-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను చూసేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్టేడియానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి లోకేశ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆయన వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏసీఏ అధికారుల చేశారు. వచ్చే విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖలో జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Similar News
News April 2, 2025
విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు వేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ -బరాంపూర్ ఎక్స్ ప్రెస్ (18526/25)కు ఏప్రిల్ 1నుంచి ఏప్రిల్ 30 వరకు 2 జనరల్ కోచ్, విశాఖ-రాయ్‌పూర్ (58528/27)కు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వరకు ఒక జనరల్ కోచ్, విశాఖ- కొరాపుట్(58538/37) ఒక జనరల్ కోచ్, విశాఖ-భవానీపట్నం పాసంజర్‌కు (58504/03)ఒక జనరల్ కోచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
News April 2, 2025
సింహాచలం అప్పన్న రథసారథికి ఆహ్వానం

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 8న జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ రథోత్సవానికి రథసారథి అయిన కదిరి లక్ష్మణరావును తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కదిరి లక్ష్మణరావు వంశానికి చెందిన వారే దశాబ్దాలుగా రథోత్సవం సారథిగా ఉండడం అనవాయితీ.
News April 2, 2025
విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.