News March 13, 2025
వైద్య సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు: కలెక్టర్

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్‌లో ఉన్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
Similar News
News March 14, 2025
నల్గొండ: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.
News March 14, 2025
నల్గొండ: శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రసవానంతరం వివిధ కారణాలవల్ల శిశువులు చనిపోవడాన్ని తగ్గించాలని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 14, 2025
నల్గొండ: ఇంటర్ పరీక్షలు.. 601మంది డుమ్మా..!

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయని డీఐఈఓ దస్రు నాయక్ తెలిపారు. గురువారం జరిగిన ప్రథమ సంవత్సరం గణితం బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ పరీక్షలకు 13వేల 772 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 13వేల 171 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 601 విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారని తెలిపారు.