News February 24, 2025

వైభవంగా నూకాంబిక జాతర రాట ఉత్సవం

image

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానంలోని బాలాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కొత్త అమావాస్య జాతర సందర్భంగా ముహూర్తం రాట మహోత్సవం జరిగింది. దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.సుజాత, దేవాదాయ డీసీ ఆఫీస్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుధారాణి, ఈవో శేఖర్ బాబు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 24, 2025

వాల్తేరు డీఆర్‌ఎంగా లలిత్‌ బోహ్ర బాధ్యతల స్వీకరణ

image

వాల్తేరు డివిజన్ రైల్వే డీఆర్‌ఎంగా లలిత్‌ బోహ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఆర్‌ఎంగా పని చేసిన సౌరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటి వరకు మనోజ్‌కుమార్‌ సాహు తాత్కాలిక డీఆర్ఎంగా వ్యవహారించారు.

News February 24, 2025

గుడిహత్నూర్: అత్తపై దాడి చేసిన అల్లుడు అరెస్ట్

image

అత్తపై గొడ్డలితో దాడి చేసిన అల్లుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఆదివారం వెంకటి(40) తన భార్యతో గొడవపడుతుండగా అతడి అత్త శశికళ మధ్యలోకి వెళ్లింది. దీంతో వెంకటి ఆమెపై గొడ్డలితో దాడి చేయడంతో మెడ భాగంలో తీవ్రగాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News February 24, 2025

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం: వైఎస్ జగన్

image

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జగన్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని అన్నారు.

error: Content is protected !!