News February 7, 2025
వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం
కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.
Similar News
News February 7, 2025
జన్నారం: ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రాపాల రాజు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జన్నారం పట్టణంలోని రామ్ నగర్కు చెందిన డాక్టర్ రాపాల రాజు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. రాపాల రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు.
News February 7, 2025
ప్రధాని మోదీని కలిసిన హీరో నాగార్జున
ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.
News February 7, 2025
కశ్మీర్‌లో ఏడుగురు చొరబాటుదారులు హతం
దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్వోసీ దాటి ఇండియన్ ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడికి యత్నించడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు.