News March 30, 2024
వైసీపీ నుంచి సిద్ధం.. జనసేన నుంచి ఎవరు.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం MP, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అభ్యర్థులను పవన్ ప్రకటించలేదు. దీంతో ఇక్కడ పోటీ విషయమై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపు YCP నుంచి సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి రమేశ్ బాబు ఎన్నికలకు సిద్ధమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా జనసేన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
Similar News
News April 19, 2025
కోడూరు: తాబేలు పిల్లలను విడిచిపెట్టిన జాయింట్ కలెక్టర్

అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను కృష్ణాజిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ సాగరంలోకి వదిలిపెట్టారు. శనివారం కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కుటుంబ సమేతంగా హంసలదీవి శివారు పాలకాయతిప్ప బీచ్ వద్ద అటవీ శాఖ వారి సంరక్షణలో ఉన్న గుడ్ల సేకరణ,సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కృత్రిమంగా విధానంలో పొడిగించిన తాబేళ్ల పిల్లలను గీతాంజలి శర్మ సముద్రంలోకి విడిచిపెట్టారు.
News April 19, 2025
VJA: లాయర్ల మధ్య వివాదం

విజయవాడ కోర్టులో ఇద్దరు మహిళా న్యాయవాదుల గొడవ పడిన ఘటన చోటు చేసుకుంది. జూనియర్ లాయర్ మనిప్రియ మాట్లాడుతూ.. సీనియర్ లాయర్లు సౌందర్య, పిట్టల శ్రీనివాస్ కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని నిరసన తెలిపారు. సౌందర్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనిప్రియపై 307 కేసు ఉందని, ఆమె జడ్జి ఎదుట అసభ్యంగా మాట్లాడి, బట్టలు చింపుకొని గొడవ చేసిందన్నారు. దీనిపై బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
News April 19, 2025
క్రికెట్ బెట్టింగ్.. చల్లపల్లిలో ఏడుగురు అరెస్ట్

చల్లపల్లిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆదేశాల మేరకు సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ జూదరులను గుర్తించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.