News March 9, 2025

వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా పేరం స్వర్ణలత

image

వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన పేరం స్వర్ణలత నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. గతంలో ఈమె వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పని చేశారు.

Similar News

News March 10, 2025

మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

image

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.

News March 10, 2025

టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

image

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.

News March 10, 2025

నేడు అనంత కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నేటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!