News April 24, 2025
వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం:రోజా

విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
Similar News
News April 24, 2025
విజయవాడ: విడదల గోపీ అరెస్ట్‌పై అప్డేట్

మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీకి విజయవాడ జీజీహెచ్‌లో కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని స్టోన్ క్రషర్ కంపెనీ నిర్వాహకులను బెదిరించిన ఘటనపై నమోదైన కేసులో గురువారం ఉదయం ACB అధికారులు హైదరాబాద్‌లో గోపిని అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ తీసుకొచ్చిన అధికారులు వైద్యపరీక్షల తర్వాత ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
News April 24, 2025
అవార్డు అందుకున్న సత్యసాయి జిల్లా కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర అమలులో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కలెక్టర్ టీఎస్ చేతన్ అవార్డును స్వీకరించారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ను ఆయన అభినందించారు.
News April 24, 2025
మద్నూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం మద్నూర్, రామారెడ్డిలో 44.8, పల్వంచలో 44.7, జుక్కల్, బాన్సువాడ, డోంగ్లిలో 44.6, నస్రుల్లాబాదులో 44.5, బిచ్కుందలో 44.4, దోమకొండలో 44.1, లింగంపేటలో 43.9, అత్యల్పంగా బీబీపేట మండలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని అధికారులు సూచించారు.