News March 20, 2025

వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.పివి నందకుమార్ రెడ్డి

image

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా డా.పివి నందకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. యూనివర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ముచ్చటించారు. వీసీకి రిజిస్టర్ సంధ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రమేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.

Similar News

News March 20, 2025

నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. 

News March 20, 2025

వరంగల్: కాళేశ్వరానికి భారీ నిధులు

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల సహా పలు ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్ రూ. 4028.59కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఇందులో సింహభాగం కాళేశ్వరానికి రూ.2,685కోట్లు ఇచ్చింది. దీంతో పెడింగ్‌లోని ప్రాజెక్టులు పనులు పూర్తికానున్నాయి.

News March 20, 2025

వరంగల్: యూనివర్సిటీకి బడ్జెట్‌లో నిధులు ఎంతంటే.?

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌‌లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి.

error: Content is protected !!