News December 3, 2024
వ్యక్తి తలపై కత్తితో దాడి: ఎస్ఐ జయబాబు
టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన నత్త నాగరాజుపై డిసెంబర్ 2న గుమ్మల్ల స్వామి అనే వ్యక్తి కత్తితో తలపై తీవ్రంగా దాడి చేసినట్లు ఎస్ఐ జయబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భూ వివాదాల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 4, 2024
ప.గో: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులు వీరే
ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపక్, డాక్టర్ కావల నాగేశ్వరరావు, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపి మూర్తి బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
News December 4, 2024
ఏలూరు జిల్లాలో భూ ప్రకంపనలు
ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకాతిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసమవ్వడంతో.. బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News December 4, 2024
ఏలూరు: ప్రేమ పేరుతో మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కేసు
ఏలూరు సత్యనారాయణ పేట చెందిన షాజహాన్ (29) (సాఫ్ట్వేర్ ఉద్యోగి) పై కేసు నమోదైనట్లు సీఐ సత్యనారాయణ బుధవారం తెలిపారు. వారి కథనం పట్టణానికి చెందిన యువతికి (23) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అయితే ఆమెను వద్దని, వారంలో వేరే యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు షాజహాన్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.