News March 10, 2025

వ్యభిచారానికి అడ్డాగా ఎల్బీనగర్..!

image

ఎల్బీనగర్‌లోని పలు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలువురు మండిపడుతున్నారు. కామినేని వద్ద లాడ్జీలు, హోటళ్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయని అధికారులు నిఘా కరవవ్వడంతో ఆడిందే ఆటగా మారిందంటున్నారు. ORR, ఆటోనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడా, DSNR హైవేలపై రాత్రుళ్లు కొందరు అసభ్యకర దుస్తులతో నిలబడి సైగలు చేస్తూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని నివారించాలని కోరుతున్నారు.

Similar News

News March 10, 2025

సోంపేట: 5 రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి

image

సోంపేట మండలం కొర్లాం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీగా పనిచేసిన తామాడ గణపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య తామాడ భారతి కూడా సరిగా 5 రోజుల ముందు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పనిచేశారు.

News March 10, 2025

కేసీఆర్ అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం: CM రేవంత్

image

TG: తాము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నామని తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘జీతభత్యం తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్. ఆయన చేసిన అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం. KCRకు భయపడి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. మూసీకి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.

News March 10, 2025

బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

image

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు. 

error: Content is protected !!